- Step 1
ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టాలి.
- Step 3
ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనెవేసి పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.
- Step 4
అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసుకోవాలి.
- Step 5
తరువాత శుభ్రం చేసుకున్న పుదీనాలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క లవంగాలు వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి.
- Step 7
తరువాత అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- Step 8
తరువాత అందులో ముందుగా తయారుచేసుకున్న పుదీనాపేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- Step 9
చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి మరో రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టౌఆఫ్ చేయాలి. అంతే పుదీనా పన్నీర్ పలావ్ రెడీ.