- Step 1
బియ్యాన్ని కనీసం అర గంట నానపెట్టాలి. ఉల్లిపాయని నిలువు ముక్కలుగా కోసుకోవాలి.
- Step 2
బేబీకార్న్ను కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- Step 3
ఒకవేళ బేబీకార్న్ను పలుచగా గుండ్రటి ముక్కలుగా కోసుకుంటే కనుక కుక్కర్లో ఉడికించాల్సిన అవసరం లేదు.
- Step 4
గుజ్జుకోసం కావాల్సిన పదార్ధాలన్నింటినీ మిక్సీలో తక్కువ నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
- Step 5
పులావ్ను కుక్కర్లో నేరుగా వండుతుంటే కనుక అందులోనే నూనె వేడిచేసి బిర్యానీఆకు, దాల్చినచెక్క, యాలక్కాయ, లవంగాలను వేసి వేగించాలి.
- Step 6
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగించి బేబీకార్న్, రుబ్బిన మసాల వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి.
- Step 7
ఇందులో నానపెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు ఉంచి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి.
- Step 8
తరువాత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నటి మంట మీద పదినిమిషాల పాటు విజిల్ పెట్టకుండా ఉడికించాలి.
- Step 9
అంతే పులావ్ రెడీ. వేడివేడి పులావ్ని ఉల్లిపాయ రైతాతో లేదా నచ్చిన ఇంకేదైనా రైతాతో తినొచ్చు.