- Step 1
నాలుగు కప్పుల నీళ్లను మరిగించి అందులో మీల్‌మేకర్ వేసి ఉంచాలి.
- Step 2
చల్లారాక నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక మీల్‌మేకర్‌ను వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పది నిమిషాలు నాననివ్వాలి.
- Step 4
ఒక మందపాటి గిన్నె లేదా పాన్‌లో నూనె, నెయ్యి లేదా డాల్డా కలిపి వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి.
- Step 5
ఇందులో అల్లంవెల్లుల్లి ముద్ద, క్యారెట్ ముక్కలు, బఠానీలు, లవంగాలు, యాలకులు, దాల్చిన, షాజీర వేసి మరో రెండు నిమిషాలు వేపాలి.
- Step 6
ఇప్పుడు పసుపు, కారం పొడి, గరం మాసాలా పొడి వేసి కలిపి ఆరు కప్పుల నీళ్లుపోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- Step 7
ఆ వెసట్లో నీటిని వడకట్టి బియ్యం వేయాలి. మంట కొంచెం తగ్గించి ముప్పావు ఉడికిన అన్నంలో వేయించిన మీల్ మేకర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటమీద మగ్గనివ్వాలి.
- Step 8
కొత్తిమీరతో అలంకరించి పెరుగు పచ్చడి లేదా కుర్మాతో ఈ మీల్‌మేకర్ బిర్యానీని సర్వ్‌చేయండి.