- Step 1
బాస్మతి బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి.
- Step 2
ఒక గిన్నెలో ఎనిమిది గ్లాసుల నీళ్లలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బియ్యానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- Step 3
నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం తీసి వేయాలి. మంట తగ్గించి బియ్యం ముప్పావు వంతు ఉడకగానే జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి.
- Step 4
బిర్యానీ చేయడానికి మందంగా ఉండే గిన్నె లేదా పాన్ తీసుకోవాలి. కుక్కర్ పాన్ ఐతే ఇంకా మంచిది.
- Step 5
ఈ గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా మెత్తబడేవరకు వేపి పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద (ఇష్టమైతే) కారం పొడి వేసి మరికొద్దిసేపు వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూరగాయలు వేసి కలిపి మూత పెట్టాలి.
- Step 6
ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత అన్నం వేసి దానిపైన నెయ్యి, కొద్దిగా పాలువేసి మూతపెట్టాలి.
- Step 7
దానిపైన బరువు ఏదైనా పెట్టి చిన్న మంటమీద మరో పది నిమిషాలు ఆవిరికి మగ్గనివ్వాలి. తర్వాత వేడిగా సర్వ్ చేయాలి.