- Step 1
బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి.
- Step 2
టొమాటోలు చిన్న ముక్కలుగా తరిగి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
పాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడిచేయాలి.
- Step 4
సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి మెత్తబడ్డాక పుదీనా ఆకులు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా వేపి, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి.
- Step 5
టొమాటో ముద్దలో బియ్యానికి సరిపడా నీళ్లు కలుపుకుని ఈ పోపులో పోయాలి.
- Step 6
అంటే పాత బియ్యమైతే గ్లాసుతో బియ్యం కొలుచుకుని ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోయాలి.
- Step 7
అప్పుడు అన్నం పూర్తిగా ఉడికి మెత్తగా కాకుండా ఉంటుంది.
- Step 8
కొత్త బియ్యమైతే నీళ్లు తగ్గించాలి. అదే నీళ్లలో తగినంత ఉప్పు వేయాలి.
- Step 9
టమాట నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్లలో నానిన బియ్యం వడగట్టివేసి ఉడికించాలి.
- Step 10
అన్నం ఉడికి, నీరంతా ఇరిగిపోయాక మంట పూర్తిగా తగ్గించి, నిదానంగా మరో ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి.
- Step 11
ఈ పులావ్‌ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో, ప్రయాణాలలో పులిహోరకు బదులుగా చేసుకుని తీసుకెళ్లొచ్చు. కుర్మా లాంటి కూర లేదా పెరుగుపచ్చడితో సర్వ్ చేయాలి.