- Step 1
ఉసిరికాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి.
- Step 2
ఇలా చేసేప్పుడు నీళ్ళు మాత్రం పోయకూడదు. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అన్నాన్ని వండి పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి జీడిపప్పు, పల్లీలు, మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- Step 4
ఇవి వేగాక కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఉసిరికాయ పొడి వేసి కలపాలి.
- Step 5
కాసేపటి తర్వాత ఉప్పు వేయాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు ముందే వండేసిన అన్నాన్ని వేసి కలపాలి.
- Step 6
చివరగా నిమ్మరసం పోసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.