- Step 1
జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి అరగంటపాటు నానబెట్టాలి.
- Step 2
ఈలోపు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి.
- Step 3
ఆ కడాయిలోనే జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకును వేయించాలి.
- Step 4
అందులో కాలీఫ్లవర్ ముక్కలు, బఠాణీలు, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి.
- Step 5
బాగా వేగాక నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి నీళ్ళు పోయాలి. ఆ తర్వాత ఉప్పు వేసి గట్టిగా మూత పెట్టాలి.
- Step 6
పావుగంట తర్వాత అన్నం కలిపి సన్న మంట మీద మరో ఐదు నిమిషాల పాటు ఉంచి దించేయాలి.
- Step 7
వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులను అందంగా గార్నిష్ చేసి వడ్డిస్తే లొట్టలేసుకొంటూ తింటారు.