- Step 1
గోబీని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసి కలిపి పేస్ట్‌లా చేయాలి.
- Step 2
ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కడాయిలో నూనె పోయాలి.
- Step 3
కలిపి పెట్టుకున్న మిశ్రమంలో గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.
- Step 4
ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి.
- Step 5
ఇందులో అజినామొటో, సోయాసాస్, టమాటా సాస్ వేసి కలపాలి.
- Step 6
ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న గోబీని ఇందులో వేసి మరికాసేపు కలియబెట్టాలి.
- Step 7
చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. గార్నిష్ చేసిన గోబీ మంచురియా మీ నోరూరించక మానదు!