- Step 1
ఉల్లిపాయ తరిగి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కారం పొడి వేసి కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ రాగానే దింపేయాలి.
- Step 3
చికెన్ కడిగిన నీళ్లు ఊరతాయి కాబట్టి మళ్లీ విడిగా నీరు పోయనవసరం లేదు.
- Step 4
ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లి తరుగు వేసి దోరగా వేపాలి. ఇందులో అజినొమొటొ, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, పంచదార వేసి కలపాలి.
- Step 5
రెండు నిమిషాల తర్వాత కలర్, మిరియాలపొడి కూడా వేసి కలిపి చికెన్ ముక్కలు వేయాలి. ఉప్పు సరి చూసుకుని మొత్తం కలుపుతూ తడి పూర్తిగా పోయేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపొరకతో అలంకరించి సర్వ్ చేయాలి.