- Step 1
మొదట రొయ్యలను శుభ్రం చేసుకోవాలి.
- Step 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి. అదే విధంగా టమోటాలు, ఉల్లిపాయ, బంగాళాదుంపను (చెక్కు తీసి) చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 3
తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు (మధ్యలో చీల్చి) వేసి వేయించుకోవాలి.
- Step 4
ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.
- Step 5
అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి.
- Step 6
తర్వాత రొయ్యలు వేయాలి. అనంతరం చిటికెడు పసుపు వేసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.
- Step 7
అలాగే టమోటా, బంగాళాదుంప ముక్కలు, కారం పొడి, ఉప్పు వేసి మరో పది నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.
- Step 8
కాసేపయ్యాక కొంచెం నీళ్ళు పోసి, ఈ మిశ్రమం దగ్గరకు అయ్యేవరకు ఐదు నిముషాలు సిమ్ లో ఉడికించి దించేయాలి.