- Step 1
నాన్ స్టిక్ పాన్ లో కాస్త వెన్న వేసి కాగాక, రొయ్యలు, కాస్త ఉప్పు, కారం వేసి వేయించాలి.
- Step 2
నీళ్లన్నీ ఇగిరి రొయ్యలు వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి.
- Step 3
అదే పాన్ లో మిగిలిన వెన్న వేసి వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
- Step 4
తరువాత మిగిలిన కారం, ధనియాల పొడి రొయ్యలు వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన చింతచిగురు వేసి తక్కువ మంట మీద ఉడికించాలి.
- Step 5
అవసరమైతే మరికొంత ఉప్పును, కాసిని నీళ్ళు చిలకరించి చిగురు పూర్తిగా రొయ్యలకూ పట్టే వరకు ఉడికించి దించాలి. ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు.