- Step 1
స్టౌ మీద పాన్ ఉంచి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- Step 2
బంగాళదుంప ముక్కలు, బఠాణీ, ధనియాలపొడి వేసి బాగా మెత్తగా అయ్యేలా కలిపి, రెండు నిముషాలు ఉడికించాలి.
- Step 3
కిందకు దించి ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తురుము వేసి కలపాలి.
- Step 4
బ్రెడ్ స్లైసులు ఫ్లాట్గా అయ్యేలా అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి.
- Step 5
ఉడికించుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, బ్రెడ్ పీస్ మీద ఉంచి పైన మరో పీస్ ఉంచి, అంచులను నీటితో తడుపుతూ అంతా మూసుకునేలా సమోసా ఆకారంలో జాగ్రత్తగా మూయాలి.
- Step 6
స్టౌ మీద పాన్ ఉంచి నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి వేయించాలి
- Step 7
బంగారురంగులోకి వచ్చాక తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి.