- Step 1
మైదాలో తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి పూరీ పిండిలా కలుపుకొని పది పురీల్లాగా చేసుకోవాలి.
- Step 2
మరో టేబుల్ స్పూన్ మైదా పిండిలో టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
పాన్ లో నూనె వేసి ఉల్లికాడల తురుము వేసి వేయించాలి.
- Step 4
తరువాత స్టఫింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలపాలి. రెండు నిముషాలు ఉడికిన తర్వాత పది భాగాలుగా చేయాలి.
- Step 5
ఒక్కో పూరీలో ఒక్కో భాగంగా చేసిన స్టఫ్ పెట్టి ఒకవైపు నుంచి చాపలా చుట్టుకొని రావాలి.
- Step 6
తరువాత రెండు చివరలా అంచుల్ని మూసేసి ఊడిపోకుండా మైదా పేస్ట్ తో అతికించాలి.
- Step 7
ఇలాగే అన్ని పూరీలను సిగార్స్ లా చుట్టి రెండు వైపులా అంచులు మూసేసి నూనెలో వేయించి తీయాలి.
- Step 8
ఎక్కువగా ఉన్న నూనెను బ్లాటింగ్ పేపర్ తో అద్దాలి.