- Step 1
రొయ్యలు వాసనా పోవాలంటే ముందుగా రెండు నిముషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి.
- Step 2
మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని రొయ్యలను వేయించుకోవాలి.
- Step 3
రొయ్యలు త్వరగా వేగిపోతాయి కనుక తొందరగా నూనెలో నుంచి చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 4
రొయ్యల పచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం కాస్త తక్కువగా వేస్తే బాగుంటుంది.
- Step 5
మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.
- Step 6
స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి.
- Step 7
స్టవ్ ఆర్పీవెసి, గిన్నెలోకి తీసుకున్నరొయ్యలను వేసి బాగా కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.