- Step 1
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి.
- Step 2
తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు కూడా వేయాలి.
- Step 3
ఇవి వేగాక కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మరో నిమిషం వేయించి చల్లారనివ్వాలి.
- Step 4
ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చే స్తే గ్రీన్ చట్నీ తయారయినట్టు. దీనిని పక్కనుంచుకోవాలి.
- Step 5
తర్వాత పనీర్‌ను చిన్న చిన్న స్లైసెస్‌గా చేసుకుని, మధ్యలో ఈ గ్రీన్ చట్నీ పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 6
శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, నీరు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
- Step 7
ముందుగా స్టఫ్ చేసిన పనీర్ ముక్కలను శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి.
- Step 8
టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే బాగుంటాయి.