- Step 1
మైదాలో కరిగించిన డాల్డా , చిటికెడు ఉప్పు వేసి కలిపి నీళ్లతో చపాతీ పిండిలా తడిపి మూతపెట్టి ఉంచుకోవాలి.
- Step 2
బజ్జీ మిరపకాయలను నిలువుగా గాటు పెట్టి లోపలి గింజలు తీసేయాలి.
- Step 3
మరుగుతున్న నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. వీటిని పూర్తిగా ఆరనివ్వాలి.
- Step 4
ఒక ప్యాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి సన్నగా తరిగిన క్యారట్ , బీన్స్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి.
- Step 5
ఇందులో పనీర్ తురుము, ఉప్పు, అజినొమొటొ, మిరియాలపొడి వేసి మరి కొద్దిసేపు వేయించి కొద్దిగా కొత్తిమిర కలిపి దింపేయాలి.
- Step 6
పూర్తిగా చల్లారాక నిమ్మరసం కలపాలి. పచ్చిమిర్చీలలో ఈ మిశ్రమాన్ని నింపి గట్టిగా వత్తి పెట్టుకొవాలి.
- Step 7
మైదా పిండిని మర్ధనా చేసి మృదువుగా అయ్యాక చిన్న ఉండలు చేసుకోవాలి.
- Step 8
ఈ ఉండను పలుచటి చపాతీలా వత్తుకుని చాకుతో సన్నటి పట్టీలలా కట్ చేసుకోవాలి.
- Step 9
ఈ పట్టీని పనీర్ మిశ్రమమ పెట్టిన మిర్చీకి రెండు వైపులా అందంగా చుట్టి ఊడిపోకుండా మిర్చీకేసి మెల్లిగా వత్తాలి.
- Step 10
అన్నీ తయారయ్యాక వేడి నూనే వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ, టమాటాలతో లేదా టమాటా సాస్‌తో సర్వ్ చేయాలి.
- Step 11
ఈ మిర్చీలను కట్ చేసి పెరుగు వగైరా వేసి చాట్ లా కూడా సర్వ్ చేయొచ్చు..