- Step 1
ఒక నాన్‌స్టిక్ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి.
- Step 2
అందులో బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి.
- Step 3
ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి.
- Step 4
ఇందులోనే వేరుశెనగ గింజల పొడి, పసుపుపొడి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి.
- Step 5
తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.
- Step 6
చివరగా స్కిమ్‌డ్ మిల్క్ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి.
- Step 7
మిశ్రమం అంతా దగ్గర పడ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి.
- Step 8
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారిన తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్ చేయాలి.
- Step 9
అంతే రుచికరమైన జాక్‌ఫ్రూట్ పొటాటో బాల్స్ రెడీ. తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి.