- Step 1
ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి.
- Step 2
అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి.
- Step 3
అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి.
- Step 4
వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి.
- Step 6
మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి.
- Step 7
కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా రెడీ!