- Step 1
పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
డోక్లా చేయాలనుకునే పళ్లెం లేదా కేక్ టిన్నుకు లోపలి వైపు నూనె రాసుకోవాలి.
- Step 3
ఒక గి న్నెలో జల్లించిన శనగపిండి తీసుకుని పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
- Step 4
ఈనో ఫ్రూట్ సాల్ట్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని నూనె రాసిన పళ్లెంలో ముప్పావు వంతు వరకు పోయాలి.
- Step 5
కుక్కర్లో గ్లాసుడు నీళ్లుపోసి ఒక స్టాండ్ పెట్టి దానిమీద ఈ పళ్లెం పెట్టి మూత పెట్టాలి.
- Step 6
కుక్కర్లో గ్లాసుడు నీళ్లుపోసి ఒక స్టాండ్ పెట్టి దానిమీద ఈ పళ్లెం పెట్టి మూత పెట్టాలి.
- Step 7
ఒక చిన్న గినె్నలో పంచదార, నీళ్లు, నిమ్మరసం వేసి కలిపి చల్లారిన డోక్లా మీద పోసి పది నిమిషాలు అలాగే వదిలేయాలి.
- Step 8
ఆ తర్వాత తిరగేసి మెల్లిగా తడితే ఉడికిన డోక్లా మొత్తం బయటికి వచ్చేస్తుంది.
- Step 9
దాన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేరే పళ్లెంలో లేదా గిన్నెలో పెట్టాలి.
- Step 10
ఈ డోక్లాలను జాగ్రత్తగా అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసి మధ్యలో తయారుచేసుకున్న గ్రీన్ చట్నీ రాసి దానిపైన మిగతా ముక్క పెట్టాలి.
- Step 12
ఇప్పుడది సాండ్విచ్లా ఉంటుంది.
- Step 12
ఒక చిన్న గినె్న లేదా గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక తీసి డోక్లాలమీద వేయాలి.
- Step 13
వీటిని వెంటనే సర్వ్ చేయొచ్చు లేదా కాస్త చల్లబరచి తిన్నా బావుంటాయి. ఇష్టముంటే పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు.