- Step 1
బంగాళాదుంపలు ఉడికించి ఆరనివ్వాలి. తరువాత తోకకు తీసి బాగా చిదమాలి.
- Step 2
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తురుము వేసి దోరగా వేగనివ్వాలి.
- Step 3
అందులో పసుపు, అల్లం, పచ్చిమిర్చి గుజ్జు వేసి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి.
- Step 4
ఇప్పుడు చిదిమిన బంగాళాదుంపలు వేసి ఉప్పు చల్లి కలుపుతూ పొడిపొడిగా వేగనివ్వాలి.
- Step 5
అనంతరం కొత్తిమీర, పూదీన వేసి బాణలిను కిందకు దించి నిమ్మరసం కలపాలి.
- Step 6
ఒక లోతైన గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, కేసరి రంగు, వంట సోడా, తగినంత ఉప్పు వేసి నీరు పోసి, గట్టి పెరుగులా పిండిని కలిపి ఉంచాలి.
- Step 7
ఆలుగడ్డల మిశ్రమాన్ని లడ్డులంత సైజ్ లో ముద్దలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి.
- Step 8
బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ముద్దలుగా చేసిన ఆలుగడ్డల మిశ్రమాన్ని పిండిలో ముంచి నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
- Step 9
అంతే ఆలూ బోండాలు రెడీ. ఇవి పచ్చిమిర్చి పచ్చడి, టమాటో సాస్ తో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.