- Step 1
బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి పొడిపొడిగా మెదిపి గిన్నెలో వేసుకోవాలి.
- Step 2
ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి.
- Step 3
గట్టిగా ఉన్న టొమాటోలను పైన కొద్దిగా కట్ చేసి, లోపలి గుజ్జంతా తీసేయాలి.
- Step 4
ఉడికించిన బంగాళదుంప మిశ్రమం కూరి, మూత పెట్టి, టూత్ పిక్‌తో విడిపోకుండా గుచ్చి పెట్టాలి.
- Step 5
ఒక గిన్నెలో శనగపిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, వంటసోడా, తగినంత నీరు వేసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి.
- Step 6
బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. టొమాటోలను శనగపిండి మిశ్రమంలో మొత్తం పిండి అంటుకునేలా ముంచి, వేడినూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.
- Step 7
కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కో బోండాను సగానికి కట్ చేయాలి. మూడు రంగులతో ఆకర్షణీయంగా ఉంంది.