- Step 1
మొక్కజొన్న గింజల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి.
- Step 2
మర్నాడు మొక్కజొన్న గింజలు, పుట్నాలపప్పు, సగం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి మిశ్రమం, తగినంత ఉప్పును తీసుకుని మిక్సీలో గట్టిగా రుబ్బుకోవాలి.
- Step 3
బాణలిలో కొద్దిగా నూనె వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేయించి కీమా చేర్చి పసుపు, మరికాస్త ఉప్పు వేసి వేయిం చాలి.
- Step 4
ఐదు నిమిషాలయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చేర్చి కలిపి దింపేయాలి.
- Step 5
ఈ పిండి గట్టిగా ఉండాలి. దీని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మొక్కజొన్నపిండిలో అద్ది కాగుతోన్న నూనెలో వేయించుకోవాలి.
- Step 6
ఈ పిండి గట్టిగా ఉండాలి. దీని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మొక్కజొన్నపిండిలో అద్ది కాగుతోన్న నూనెలో వేయించుకోవాలి.