- Step 1
ఒక గిన్నెలో చాకోస్, సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, పిస్తా ముక్కలు తీసుకుని చాక్లెట్ తురిమి వేయాలి.
- Step 2
ఇదంతా కలిపి ఉంచుకోవాలి. మైదాలో కరిగించిన డాల్డా, చిటికెడు ఉప్పు వేసి కలిపి అవసరమైనన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి.
- Step 3
అరగంట తర్వాత తీసి కాస్త నూనె రాసుకుని బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
- Step 4
బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడి పిండి చల్లుకుంటూ పల్చగా, చిన్న పూరీలా వత్తుకోవాలి.
- Step 5
మధ్యలో చెంచాడు చాక్లెట్, నట్స్ మిశ్రమం పెట్టి నాలుగు వైపులనుండి మూసేయాలి.
- Step 6
అంచులు విడిపోకుండా గట్టిగా వత్తిపెట్టాలి. వీటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీయాలి.
- Step 7
వీటిని ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. పిల్లలు అలాంటివి ఇష్టపడకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి.