- Step 1
ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు మరిగించి నూడుల్స్ వేయాలి.
- Step 2
అవి ముప్పావు వంతు ఉడికిన తర్వాత తీసి జల్లెట్లో వేసి వెంటనే దాని మీద చల్లటి నీళ్లు పోయాలి.
- Step 3
దానివల్ల నూడుల్స్ ఇంకా ఉడికి మెత్తబడకుండా ఉంటాయి.
- Step 4
చికెన్, రొయ్యలు కూడా సగం ఉడికించి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి.
- Step 5
తర్వాత ఉడికించి చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, రొయ్యలు వేసి మరో రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి.
- Step 6
ఇందులో సోయా సాస్, ఆయిస్టర్ సాస్ వేయాలి. కొంచం వేగిన తర్వాత నూడుల్స్ వేసి కలపాలి.
- Step 7
తర్వాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, పండు మిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపొరక వేసి రెండు నిమిషాలు వేపి దింపేయాలి.