- Step 1
వంకాయ చుట్టూ (నాలుగు చుక్కల) నూనె రాసి మంటపై తిప్పుతూ కాల్చాలి.
- Step 2
చల్లారిన తర్వాత పై తొక్క తీసి మెదిపి పెట్టుకోవాలి.
- Step 3
ఆలుని కూడా ఉడికించి తొక్కతీసి సన్న ముక్కలుగా తరగాలి.
- Step 4
కడాయిలో నూనె వేసి జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఉల్లి పచ్చిమిర్చి తరుగు వేసి వేగాక టమోటా ముక్కలు వేయాలి.
- Step 5
అవి మెత్తబడ్డాక పసుపు, కారం, దనియాలపొడి, ఉప్పు కలిపి ఒక కప్పు నీరు పోయాలి.
- Step 6
5 నిమిషాలయ్యాక వంకాయ గుజ్జు, ఆలు ముక్కలు వేసి మరికొంత సేపు ఉంచి కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.
- Step 7
ఈ కూర చపాతీ, పరాటాల్లోకి చాలా బాగుంటుంది.