- Step 1
ఓ గిన్నెలో బఠానీలు వేసి మునిగే వరకు నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి.
- Step 2
ఉదయాన్నే బఠానీలను ఫ్రెషర్ కుక్కర్ లో వేసి సోడా, ఉప్పు, ఇంగువ వేసి ఉడికించాలి.
- Step 3
తరువాత నీళ్ళు వంపేసి బఠానీలను ఓ గిన్నెలో వేయాలి.
- Step 4
బంగాళాదుంపలను ఉడికించి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి.
- Step 5
ఉల్లిపాయ, టొమాటో, కీరా దోస అన్నింటిని చిన్న ముక్కలుగా కోయాలి. వీటికి బంగాళాదుంపలు కూడా చేర్చి కలపాలి.
- Step 6
ఇప్పుడు ఓ ప్లేటులో రెండు టేబుల్ స్పూన్ల బఠానీలు వేసి వాటి మీద కొద్దిగా ఉల్లిముక్కల మిశ్రమం వేసి గరం మసాలా, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి చల్లాలి. వీటిమీద కొద్దిగా చింతపండు చట్నీ, గ్రీన్ చట్నీలు వేసి నిమ్మరసం పిండి అందించాలి.