- Step 1
ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపుదినుసులు వేసి వేయించుకోవాలి.
- Step 3
తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి.
- Step 4
అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి.
- Step 5
అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి పెరుగు ఉప్పు వేసి కలియబెట్టాలి.
- Step 6
చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేపముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి.
- Step 7
తరువాత గరంమసాలా, బెల్లంపొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి