- Step 1
మాంసాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చాక దించేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వెడెక్కాక లంగాలు, యాలకులు, బిర్యాని ఆకులు, ద్రాక్షంచెక్క వేసి వేయించుకోవాలి.
- Step 3
తరువాత పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- Step 4
ఉప్పు, కారం, పసుపు, గోంగూర వేసి మగ్గనివ్వాలి.
- Step 5
ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న మాంసాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి.
- Step 6
దీన్ని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.