- Step 1
బోన్లెస్ ఫిష్ తీసుకుని రెండంగుళాలసైజు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ , మైదా, గుడ్లు కొట్టివేసి, కలర్, తగినంత ఉప్పు వేసి కలిపి ఫిష్ ముక్కలను వేసి బాగా కలపాలి.
- Step 3
బాణలిలో నూనె వేడి చేసి ఈ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఈ ముక్కలను అలాగే తినొచ్చు. లేదా మరి కొంచెం మసాలాలు వేసి ఘాటుగా చేసుకోవచ్చు.
- Step 5
పాన్ లో మూడు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి, అల్లం ముక్కలు కూడా వేయాలి.
- Step 6
కొద్దిగా వేపిన తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేపాలి.
- Step 7
ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
- Step 8
తర్వాత కారం పొడి, ఉప్పు, అజినొమొటో వేసి కలిపి వేయించిన ఫిష్ ముక్కలు వేసి కలుపుతూ మరో రెండు నిమిషాలు వేపి కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి.