- Step 1
ముందుగ బటనిలను ఒక రోజు ముందుగ నానపెట్టుకోవాలి.
- Step 2
తరువాత కుక్కరులో కాలీఫ్లవర్ ముక్కలు, ఆలూ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బటాణి, క్యాప్సికం వేసి సరిపడ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
- Step 3
ఉడికిన తరువాత వాటిని గరిట తో పేస్టు లాగ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె పోసుకొని కాగాక ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
- Step 5
అవి వేగాక టమోట ముక్కలు, పసుపు కూడా వేసి బాగా వేయించాలి.
- Step 6
వేగాక తయారుగా ఉన్న పేస్టు, కారం, పావ్ భాజీ మసాల, గరం మసాల, ఉప్పు వేసి కొద్దిగా గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి.
- Step 7
కొద్దిగా గట్టి పడిన తర్వత దింపుకోవాలి.
- Step 8
ఇప్పుడు పావ్ భాజీ బన్ ని సగానికి కట్ చేసి మద్యలో బటర్ రాసి పెనం పై దోరగా కాల్చుకొని తయారు చేసుకున్న మసాలపై ఉల్లిపాయ, టమాట ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసంతో వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన పావ్ భాజీ రెడీ.