- Step 1
ముందుగా అన్నన్ని బాగా చల్లారపెట్టుకోవాలి. తరువాత మామిడికాయను పొట్టు తీసి తురుము కోవాలి.
- Step 2
తరువాత బాణలిలో నూనె పోసి కాగాక పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అదే నూనెలో పోపు గింజలు వేసి, కొద్దిగా వేగిన తరువాత కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి మరియు పసుపు వేసి కొద్ది సేపు వేయించాలి.
- Step 4
ఇప్పుడు అందులో మామిడికాయ తురుము, కొద్దిగ ఉప్పు మరియు అల్లం తురుము కూడా వేసి చిన్న మంటపై 5 నిమిషాలు బాగా వేయించాలి.
- Step 5
తరువాత చల్లార్చిన అన్నం లో ఈ పోపు వేసి అంతా బాగా కలిసేలగా కలుపుకోవాలి.
- Step 6
అందులో ఇప్పుడు మరో సరి ఉప్పు సరిచూసుకొని, వేయించిన పల్లీలు, జీడిపప్పు తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
- Step 7
అంతే రుచికరమైన మామిడికాయ పులిహోర తయార్. మీరు కూడా ఈ ఉగాదికి మామిడి కాయ పులిహోరని ట్రై చేయండి.