- Step 1
మీల్ మేకర్లను 15 నిముషాలు గోరు వెచ్చని నీళ్ళలో నానపెట్టాలి.
- Step 2
తరువాత వీటిని గట్టిగా పిండి మిక్సి లో వేసి మెత్తగా చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో మొక్క జొన్నపిండి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపి పది నిముషాలు అలాగే ఉంచాలి.
- Step 4
తరువాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకోని అరచేతిలో కొద్దిగా మందంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు పెనం వేడి చేసి వీటిని నూనె తో ఎర్రగా కాల్చుకోవాలి.
- Step 6
అంతే వేడి వేడి మీల్ మేకర్ కట్లెట్ రెడీ, వీటిని టమాటాసాస్ తో కలిపి తింటే చాల రుచిగా ఉంటాయి.