- Step 1
ముందుగ డాల్డాలో పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాలి. కోడిగుడ్డుసొనలో వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి.
- Step 2
ఓ గిన్నెలో మైదా పిండి, చిన్నచిన్న ముక్కలుగా కోసిన బాదంపప్పు, టూటీఫ్రూటీలు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి.
- Step 3
తరువాత మైదా పిండిలో డాల్డా మిశ్రమం, కోడిగుడ్డు సొనలు కూడా వేసి బాగా కలిపి పిండిముద్దలా చేసి 10 నిమిషాలు కదపకుండా అలాగే పక్కన ఉంచాలి.
- Step 4
తరువాత పిండిని ముద్దలుగా విడదీసి రెండు చపాతీల మందాన చేసి డైమండ్ లేదా చతురస్రాకారంలో ముక్కలుగా కోయాలి.
- Step 5
ఓ వెడల్పాటి ట్రేలో అడుగున వెన్న రాసి దానిపైన కొద్ది మైదా పిండి పలుచగా చల్లి, కోసిన ఈ ముక్కల్ని అందులో సర్ది, ఓవెన్‌లో 350 డిగ్రీల ఫారన్‌హీట్ డిగ్రీల వద్ద 15 నిమిషాలపాటు బేక్ చేసి తీయాలి.
- Step 6
చల్లారాక డబ్బాలో సర్దితే 15 రోజులు నిల్వ ఉంటాయి.