- Step 1
ముందుగా పాలని బాగా కాచి అందులో రెండు చుక్కలు నిమ్మరసం కలిపితే పాలు విరిగి పోతాయి.
- Step 2
ఆ విరిగిన పాలని ఒక బట్టలో వడకట్టాలి. అప్పుడు నీరు అంత పోయి గట్టి ముద్దగా తయారవుతుంది.
- Step 3
ఇప్పుడు ఈ పదార్థాన్ని తడి చేతితో బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆరిపోకుండా తడిబట్టతో కప్పి ఉంచాలి.
- Step 4
తరువాత పంచదారలో తగినన్ని నీళ్లుపోసి పాకం తయారు చేసి, పాకం తాయారు అయిన తరువాత పక్కకు తీసి కొద్దిసేపు చల్లారనివ్వాలి.
- Step 5
తరువాత బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ ఉండలను చిన్న మంటపై 2 నిమిషాలు వేయించి తీసి పాకం లో వేయాలి.
- Step 6
ఆ తరువాత యాలకులపొడిని అందులో చల్లి ఓ గంటసేపు నానపెట్టాలి.
- Step 7
ఉండలలోకి పాకం బాగా పట్టి, పాకం బాగా చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యని రసగుల్లా స్వీట్ రెడీ.