- Step 1
బాణలిలో కొద్దిగ నెయ్యి వేసి రవ్వని కొద్దిగ ఎర్రగా వేయించాలి.
- Step 2
మందపాటి గిన్నెలో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు అందులో వేయించిన రవ్వ వేసి బాగా కలపాలి.
- Step 3
అందులో మిగత నెయ్యి కూడా వేసి ఒక సరి కలపాలి. ఇప్పుడు అందులో పంచదార, యాలకుల పొడి, ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలపాలి.
- Step 4
తరువాత మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక జీడిపప్పు-ద్రాక్ష లను వేసి దోరగా వేయించి, తాయారు చేసిన రవ్వ కేసరిలో కలుపుకోవాలి.
- Step 5
ఇప్పుడు గోధుమ పిండిలో కొద్దిగా పాలు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలపాలి. ఇప్పుడు దీనిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- Step 6
వీటిని పూరీల్లగా వత్తి మద్యలో కొద్దిగా కేసరి మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ పూరీల్ల వత్తాలి.
- Step 7
ఇప్పుడు వీటిని నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.
- Step 8
అంతే చాల రుచిగా ఉండే కేసరి పూరీలు రెడీ.