- Step 1
శెనగలు రాళ్ళు లేకుండా శుభ్రం చేసి, కడిగి, రెండు గంటలు నానబెట్టాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లో శెనగలు వేసి, కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి.
- Step 3
రెండు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి. ఆవిరి పోయాక మూతతీసి ఉడికినవో లేవో చూసి, ఉడకకపోతే స్టవ్ వెలిగించి మళ్లీ కాసేపు ఉడక నివ్వాలి.
- Step 4
శెనగలులో నీళ్ళు వుంటే వంచి పక్కన పెట్టాలి.
- Step 5
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచేయ్యాలి.
- Step 6
కాగిన నూనేలో ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, కారం, ఉప్పు వేసి ఉడికిన శెనగలు వేసి కలిపి స్టవ్ ఆపాలి(కావాలంటే తినే ముందు ఉల్లి ముక్కలు, నిమ్మరసం వేసుకొని తినొచ్చు)* అంతే తాలింపు శెనగలు రెడి.