- Step 1
ఒక గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవలెను.
- Step 2
ఒక గిన్నె లో కార్న్ ఫ్లౌర్, మైదా, సోయ్ సాస్, చిల్లి సాస్, టొమాటో సాస్, 1 tablespoon నిమ్మ రసం, చిటికెడు అజినోమోటో, 1 tablespoon వైట్ పెప్పర్, తగినంత కారం, ఉప్పు వేయాలి.
- Step 3
వీటినన్నిటిని కోడి గ్రుడ్డు తో కలిపి పేస్టు లాగ చేసుకోవాలి.
- Step 4
అందులో చికెన్ రెక్క ముక్కలు వేసి కలపాలి.
- Step 5
ఒక పాన్ లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- Step 6
అందులో చికెన్ ముక్కలు వేసి fry చేయాలి.
- Step 7
వేరే బాండలి లో రెండు గరిటెల నూనె పోసి వేడి చేసుకోవాలి.
- Step 8
అందులో పచ్చి మిరపకాయలు, కరివేపాకు, వేసి ఒక రెండు నిముషాల పాటు fry చేయాలి.
- Step 9
అందులో రెండు cups నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. అందులో 1 teaspoon చిల్లి సాస్, అర teaspoon సోయ్ సాస్, చిటికెడు అజినోమోటో, 1 teaspoon వైట్ పెప్పర్, తగినంత ఉప్పు వేసి కలపాలి.
- Step 10
అందులో చికెన్ ముక్కలు వేసి నీళ్ళు అన్ని ఇంకి పోయేంత వరకు కలుపుకోవాలి.
- Step 11
నిమ్మ రసం వేసి కలిపితే చైనీస్ చికెన్ 64 రెడీ.