- Step 1
క్యేరేట్, పచ్చి బఠాని, బీన్స్, బంగాళా దుంప లను ఉడికించి దీనికి పనీర్ తురుము , పచ్చిమిర్చి తురుము, ఉప్పు కలిపి ముద్దలా చెయ్యాలి.దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.
- Step 2
కడాయిలో కొద్దిగా నూనె వేసి ఈ ఉండలను కాసేపు వేయించాలి.
- Step 3
ఇప్పుడు మైదా లో మసాలా, ఉప్పు, కొత్తిమీర, జీరా పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా చెయ్యాలి.
- Step 4
ఈ ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకోని కాస్త వెడల్పు చేసి దానిలో పనీర్ ఉండను పెట్టి మళ్ళిఉండాలా చేసి దీనిని చేతితో కొంచెం వెడల్పుగా చెయ్యాలి.(బిళ్లలుగా )వీటినే కబాబ్స్ అంటారు.
- Step 5
ఈ బిళ్లలుగా చేసిన వాటికి ఒక వైపు జీడిపప్పు గుచ్చి పక్కనపెట్టాలి.
- Step 6
ఇలా అన్ని చేసిన తరువాత నూనె వేడి చేసి వీటిని దొరగావేయించాలి. వేడిగా ఉన్నప్పుడే తింటే ఆ రుచే వేరు.