- Step 1
మైదాలో కొద్దిగా పంచదార పొడి, చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నెయ్యి వేసి ముద్దలా కలిపి పక్కన పెట్టాలి.
- Step 2
ఇప్పుడు కొబ్బరి కోరుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెపెట్టి దానిలో పంచదార, కొద్దిగా మిల్క్ మైడ్ వేసి తీగపాకం పట్టాలి.
- Step 3
పాకంలో కొబ్బరికోరు వేసి గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. గట్టి పడిన దానిలో యాలుకలపొడి వేసి కలిపి పక్కనపెట్టాలి. దీనిలో చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదాం, పిస్తా పప్పులు వేసి కలిపి పక్కన పెట్టాలి.
- Step 4
ఇప్పుడు మైదాని చిన్నచిన్న ఉండలుగా చేసి చెపాతిచెయ్యాలి. దీనిని మధ్యకు కట్ చేసి ఒక ముక్కను సమోసాలా చుట్టి దానిలో కొబ్బరి మిశ్రమం పెట్టి మూసి వెయ్యాలి.
- Step 5
అలాగే మొత్తం సమోసాలు చేసి పక్కన పెట్టాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి తయారు చేసిన సమోసాలు వేసి దోరగా వేయించి తియ్యాలి.
- Step 7
ఇప్పుడు పంచదార తీగపాకం పట్టి వేయించిన సమోసాలు పాకంలో వేసి ఐదునిముషాలు వుంచి, తీసి ప్లేటులో పెట్టాలి. అంతే కొబ్బరి స్వీట్ సమోసా రెడి.