- Step 1
క్యారెట్ తురుములో నీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. క్యారెట్ బాగా ఉడికిన తరువాత నీటిని ఒంపేసి క్యారెట్ తురుముని ఆరబెట్టాలి.
- Step 2
చల్లారిన తరువాత క్యారెట్, కోడిగుడ్డు సొన, చీజ్, చక్కెర కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
- Step 3
దీన్ని ఓ బౌల్ లోకి తీసుకుని, కొద్దికొద్దిగా మైదాపిండి వేసి కలుపుతూ ఉండాలి. చపాతీ పిండిలా అయ్యేవరకూ బాగా కలుపుకుని పక్కన పెట్టేయాలి.
- Step 4
అరగంట తరువాత కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని, ఉండలు చేసుకుని, చపాతీల్లా ఒత్తాలి.
- Step 5
వీటిని నాలుగు వైపులా చాకుతో కోసేసి, ఆ తరువాత ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి.
- Step 6
మైక్రో అవన్ ఉన్నవాళ్లు 350 డిగ్రీల వద్ద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అవన్ లేకపోతే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.