- Step 1
అరటికాయల్నిఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి.
- Step 2
తరువాత వలిచి చిన్నచిన్న ముక్కలు ఉండేలా చిదపాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
- Step 4
నూనె కాగాక, పోపు దినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగానివ్వాలి.
- Step 5
పసుపు వేసి కలిపి, చిదిమిన అరటికాయపొడిని, ఉప్పు వేసి కలిపి ఒక నిముషo మూతపెట్టి ఉంచాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ ఆపి, నిమ్మ రసం కలిపి కొత్తిమిర జల్లి వడ్డించాలి అంతే అరటికాయ వేపుడు రెడి. (దినినినే అరటికాయ పొడికూర అని కుడా అనొచ్చు)