- Step 1
ఒక గిన్నెలో క్యాబేజి తరుము, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి.
- Step 2
తరువాత అందులో మైదాపిండి, కార్న్‌ఫ్లోర్ కూడా వేసి తగినంత నీరు పోసి గట్టిగా ఉండే విధంగా కలిపి ఉంచుకోవాలి.
- Step 3
స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె పోసి అది వేడెక్కాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేగించాలి.
- Step 4
మరో బాణలిలో కొద్దిగా బటర్ వేసి అది వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.
- Step 5
తర్వాత కొద్దిగా సోయాసాస్, చిల్లీసాస్ వేసి ఒక్క నిమిషం వేగించి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి.
- Step 6
మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో కలపాలి.
- Step 7
సూప్ కాస్త చిక్కబడిన తరువాత దించి అందులో మిరియాల పొడి కలపాలి.
- Step 8
ఆపైన వేగించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసి మరో ఐదు నిమిషాలు స్టవ్‌పై ఉడికించి దించేయాలి.
- Step 9
సూప్ వేడిగా ఉన్నప్పుడే బవుల్‌లో పోసి పైన కొత్తిమీర, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.