- Step 1
కుక్కర్లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 2
తరువాత వెల్లుల్లి పేస్టు, షాజీరా కూడా వేయాలి. ఇప్పుడు కీమా వేసి నీరు పోయేంత వరకూ ఉడికించాలి.
- Step 3
ఇందులో ఎండుకారం, పసుపు, ఉప్పు, టమోటాలు, కొత్తిమీర, కాజుపేస్ట్ వేసి బాగా కలపాలి.
- Step 4
కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత గరంమసాలా కూడా వేసి దించేయాలి.
- Step 5
ఇది చల్లారిన తర్వాత బ్రెడ్‌పై అప్లయి చేసి పైన మరో బ్రెడ్‌తో మూసేయాలి.
- Step 6
దీన్ని పైనంపై కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. గార్నిష్ కోసం క్యారెట్, కీరా, కొత్తమీరతో అలంకరించుకోవాలి.