- Step 1
మైదా, బేకింగ్‌పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు అన్నీ కలిపి జల్లెడ పట్టి ఉంచుకోండి.
- Step 2
పెద్దగిన్నెలో వెన్న, పంచదార మృదువుగా అయ్యేదాకా గిలకొట్టండి.
- Step 3
గుడ్లు, తెల్లసొన కూడా వేసి నురగవచ్చేలా బాగా గిలకొట్టండి.
- Step 4
తరువాత అందులో అరటిపండు గుజ్జు, వెనిలా, పాలు, మైదా వేసి బాగా కలపండి.
- Step 5
ఈ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసి తొమ్మిది అంగుళాల పాన్‌లలో సర్ది ఓవెన్‌లో 350 డిగ్రీల దగ్గర అరగంటసేపు బేక్ చేయండి.
- Step 6
దీనిని కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. చల్లారిన తరువాత క్రీంచీజ్‌తో అలంకరించి తింటే భలే రుచిగా ఉంటుంది.