- Step 1
బ్రెడ్ ముక్కల్ని ఆ చివర ఈ చివర తీసేసి వెన్న రాయండి. ఒక్కొక్క దాన్ని నాలుగు ముక్కలు చేసి పెట్టుకోండి.
- Step 2
తీసేసిన బ్రెడ్ చివరల్ని మిక్సీలో వేసి పొడి కొట్టండి.
- Step 3
ఎండుద్రాక్ష, ఆపిల్, కర్జూరం ముక్కల్ని చక్కెర పాకంలో వేసి ఒక అరగంట నానబెట్టండి.
- Step 4
పాలు వేడిచేసి గోరువెచ్చగా ఉండగానే ఒక అరకప్పు పక్కన పెట్టి కస్టర్డ్ పౌడరు కలపండి.
- Step 5
మిగతా పాలని చిక్కబడేదాకా ఉంచి దించి చక్కెర కలిపి కాస్త చల్లబడ్డాక కస్టర్డ్ పౌడరు, బ్రెడ్ ముక్కల పొడి కలపాలి.
- Step 6
కేక్ గిన్నెకు నెయ్యి రాసి అడుగున వెన్న రాసిన బ్రెడ్ ముక్కలు వేసి దానిపైన పాకంలో నానబెట్టిన పండ్ల ముక్కలు, పాలు పోసి ఐదు నిమిషాల తర్వాత కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి.
- Step 7
40-45 నిమిషాలు పట్టొచ్చు. దించాక మరికొన్ని పండ్ల ముక్కలు వేసి పెట్టండి.