- Step 1
ఒక పాత్రలో కొంత మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, వెన్న, పంచదార వేసి కలపాలి.
- Step 2
తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి.
- Step 3
దీనికి బటర్‌స్కాచ్ ఎసెన్స్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి.
- Step 4
మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి.
- Step 5
తరువాత ఎలకి్ట్రక్ ఓవెన్లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40-50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్ చేయాలి.
- ఐసింగ్ ఇలా :
- Step 6
వెన్న, ఐసింగ్ షుగర్లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి.
- Step 7
దీనికి ఎసెన్స్, ఫుడ్ కలర్, కొద్దిగా వేడినీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి.
- Step 8
ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన బటర్‌స్కాచ్ క్యాండీస్‌తో అలంకరించాలి.
- Step 9
(నాన్‌వెజ్‌ను ఇష్టపడేవారు గుడ్డును కూడా బటర్‌స్కాచ్ కేక్‌లో కలుపుకోవచ్చు)