- Step 1
ముందుగా ఒవెన్‌ను 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో వేడి చేయాలి. మైదాలో వంటసోడా, ఉప్పు కలిపి జల్లించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
గుడ్ల మిశ్రమంలో చక్కెరను వేసి ఐదు నిమిషాల పాటు గిలక్కొట్టాలి.
- Step 3
ఈ మిశ్రమంలో నూనె కూడా పోసి మరి కొద్దిసేపు గిలక్కొట్టాలి.
- Step 4
తర్వాత పెరుగు, వెనీలా ఎసెన్స్‌ను వేసి బాగా కలపాలి. తర్వాత మైదా మిశ్రమాన్ని, కోకో పౌడర్‌ను కూడా వేసి కలపాలి.
- Step 5
8 ్ఠ 8 సైజు గిన్నెలో నెయ్యి లేదా నూనె పూసి దానిలో కొద్దిగా మైదా పిండిని చల్లాలి.
- Step 6
ఈ గిన్నెలో పై మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 40 నిమిషాల పాటు బేక్ చేయాలి.
- Step 7
కేక్ కొద్దిగా వేడిగా ఉండగానే కుకింగ్ చాకొలేట్‌ని దాని పైన పోసి చెక్క గరిటతో సమానంగా ఉండేలా సర్దాలి.
- Step 8
రంగురంగుల స్ర్పింక్లర్స్‌ను పైన అందంగా అలంకరించాలి.