- Step 1
నీళ్లలో గంధం పొడి వేసి గరిటెతో కలిపి పన్నెండుగంటలు నానబెట్టాలి.
- Step 2
ఆ తరువాత మళ్లీ ఒకసారి కలిపి పలుచటి బట్టలో వడకట్టాలి.
- Step 3
కాసేపయ్యాక గంధం పొడి చేరి నీళ్లు కిందకు దిగవు. స్పూన్‌తో పేరుకున్న పొడిని కాస్త అటుఇటు కదిపితే నీళ్లు దిగుతాయి.
- Step 4
నీళ్లన్నీ వడకట్టాక చివరకు మిగిలిన పొడిని ఒక దగ్గరకు చేర్చి పలుచటి బట్టను పిండాలి.
- Step 5
ఆ తరువాత పిప్పిని చెత్త బుట్టలో పారేయకుండా మొక్కలకు వేసుకుంటే ఉపయోగం.
- Step 6
వడకట్టిన గంధం నీళ్లలో పంచదార వేసి గిన్నెను స్టవ్ మీద ఉంచాలి.
- Step 7
స్టవ్ సన్నటి మంటలోనే ఉంచి ఉడుకు రానివ్వాలి. గంధం మిశ్రమం చేతికి అతుక్కునే వరకు లేదా తీగ పాకంలా వచ్చే వరకు ఉడికించాలి.
- Step 8
సిరప్ తయారయ్యాక శుభ్రమైన గాజు సీసాలో ఈ పాకాన్ని మళ్లీ ఒకసారి వడకట్టాలి.
- Step 9
పాకం బాగా చల్లారాక గాజు సీసాకు మూత గట్టిగా బిగించి సీసాను ఫ్రిజ్‌లో ఉంచాలి.
- Step 10
ఇక మీకు ఎప్పుడు షర్బత కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అయితే షర్బత తయారుచేసుకునేటప్పుడు పావు భాగం సిర్‌పలో ముప్పావు భాగం నీళ్లు కలపాలి.