- Step 1
క్యారెట్ తురుముకు, ముక్కలకు కొద్దికొద్దిగా పాలు జతచేస్తూ విడివిడిగా ఉడికించుకోవాలి.
- Step 2
ఉడికిన క్యారెట్ ముక్కల్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి, జీడిపప్పును వేగించి తీసేయాలి.
- Step 3
తర్వాత ఉడికిన తురుముని, రుబ్బుకున్న ముక్కల మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు వేగించాలి.
- Step 4
ఆ తర్వాత పంచదార కలిపి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
- Step 5
ఈ లోగా కోవా, పచ్చికొబ్బరిని గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి మిగిలిన పాలు వేసి కొద్దిసేపు ఉడికించాలి.
- Step 6
నెయ్యి పైకి తేలినప్పుడు దించేసి యాలకులపొడి, జీడిపప్పు, కుంకుమపువ్వులతో అలంకరించుకోవాలి.