- Step 1
బేబీకార్న్‌ను అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
చిటికెడు ఉప్పు, మిరియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరిగించిన 1 టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్‌లను బేబీ కార్న్‌కు పట్టించి పది నిమిషాలు పక్కనుంచాలి.
- Step 3
తర్వాత పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో వీటిని వేసి అన్నివైపులా వేగించి, తీసి పక్కనుంచాలి.
- Step 4
అదే పాన్‌లో అల్లం, వెల్లుల్లి తరుగు పెద్ద మంట మీద అర నిమిషం వేగించాలి. తర్వాత ఉల్లి కాడల తరుగు, క్యాప్సికం ముక్కలు వేగించాలి.
- Step 5
అవి వేగాక పచ్చిమిర్చి పేస్టు, టమోటా, సోయా సాస్‌లు, వెనిగర్, పంచదారలతో పాటు వేగించిన బేబీకార్న్ కలిపి పెద్దమంటపై ఒక నిమిషం వేగించి, పావుకప్పు నీరు పోయాలి.
- Step 6
నిమిషం తర్వాత మిగతా కార్న్‌ఫ్లోర్ వేసి చిక్కబడ్డాక ఉల్లికాడలు (పచ్చవి) చల్లి దించేయాలి. స్నాక్స్‌గా గాని, వెజ్‌బిర్యానిలో సైడ్ డిష్‌గా గాని బాగుంటాయి.